పల్లెల్లో పారిశుద్ధ్య పనులు
పల్లెల్లో కరోనా కేసులు నమోదవుతున్న నేపద్యంలో మెంటాడ మండలం లోని అన్ని గ్రామాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. చింతలవలస, జక్కువ, మెంటాడ, మీసాల పేట, బడే వలస తదితర పల్లెల్లో ఆయా గ్రామాల సర్పంచులు గేదెల అన్నపూర్ణ, లచ్చి రెడ్డి సత్యవతి, మహంతి రామ్ నాయుడు, మీసాల పార్వతి ఆధ్వర్యంలో ముమ్మరంగా పారిశుద్ధ్య కార్మికులు మట్టిని తొలగించి శుభ్రం చేసే బాధ్యత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు.
No comments:
Post a Comment