ఘనంగా కార్మిక దినోత్సవం...
పారిశుధ్య , స్మశాన వాటిక కార్మికులకు సన్మానం ..
వరదయ్య పాలెం, పెన్ పవర్ న్యూస్
వరదయ్యపాలెం మండలం బత్తలవల్లంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం స్థానిక సచివాలయంలో అవరణలో, స్వచత్ రూరల్& అర్బన్ డెవలప్ మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ అధికారపార్టీ ప్రచార కార్యదర్శి ఓడూరు ఉజ్వల రెడ్డి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు ,గ్రామ స్మశాన వాటిక కార్మికులు సచివాలయ సిబ్బంది నడుమ కరోనా నిబంధనలు పాటిస్తూ అ. ఆనందోత్సవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉజ్వలరెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్నా,ప్రజా శ్రేయస్సు ను దృష్టిలో ఉంచుకుని వారి ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజాసేవలో నిమగ్నమైన పారిశుధ్య, మరియు స్మశానవాటి కార్మికుల పని తీరు ఎంతో ఉన్నతంగా ఉందని ఆయన కోనియాడారు.
ఇలాంటి కార్మికులను గుర్థించి , వారికి సహకరించాలనీ కోరారు, మానవరూపంలో సేవలందిస్తున్న వారిని దైవస్వరూపులుగా బావిచాలన్నారు,ఈ సందర్భంగా ఆయన వారిచేత కేక్ కట్ చేసి,చిరు సత్కారం చేసి ఆనందిం జేశారు. ఈకార్యక్రమంలో స్వచత్ రూరల్ సోసైటి, ప్రెసిడెంట్ మోహన్, సెక్రటరీ కిషోర్, సభ్యుడు షన్ముగం,గ్రామ సర్పంచ్ మణి, వార్డు సభ్యుడు వేనాటి అశోక్,మునిశేఖర్,ఎం పీ టి సి అభ్యర్థి,కస్తూరిధనపాల్,, సచివాల సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment