Followers

ఘనంగా మే డే....

 ఘనంగా మే డే....



చిత్తూరు, పెన్ పవర్ 

నగరి పట్టణంలో సిఐటియు నాయకులు ఆధ్వర్యంలో  మే డే ను ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టంలోని కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, అనంతరం  మున్సిపాలిటీ పరిధిలోని సత్రవాడ, ఏకాంబరకుప్పం అలాగే తిరుత్తని రోడ్డులోని ఆటో స్టాండ్ వద్ద కార్మికుల జెండాను ఎగరవేశారు, ఈ సందర్భంగా నగరి పట్టణ సి ఐ టి యు కార్యదర్శి పెరుమాళ్ మాట్లాడుతూ దేశంలో కార్మికులు లేనిదే ఏ పని జరగదని గుర్తుచేశారు. కార్మికులను ఆదుకుంటానని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి ప్రధాన మంత్రి. మోడీ  కార్మికులను  విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. కార్మికులను విస్మరించిన ఏ ప్రభుత్వం నిలవలేదని హెచ్చరించారు. కరోనా కాలంలో పనులు లేక కార్మికులు నానా అవస్థలు పడుతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయాలని తెలిపారు నిత్యవసర వస్తువులు ధరలను తగ్గించాలని, పెట్రోల్, డీజిల్  జిఎస్టి లో కలపాలని తెలిపారు. కార్మికుల దినోత్సవాన్ని సంఘీభావంగా ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. గోవిందస్వామి, వాసు, షణ్ముగం, జగదీష్,సందీప్,ఉమాపతి,అయ్యప్ప,మాయా,తమిలరసన్,ఎయిల్,ప్రవీణ్,కంధన్,మునిరత్నం,శ్రీనివాసన్,శరవణన్,మయిలుస్వామి,సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...