కరోనా వైరస్ తో రేషన్ కార్డుదారుల ఇక్కట్లు
బెల్లంపల్లి , పెన్ పవర్తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతానికి పైగా కార్డుదారులు వివిధ కారణాలవలన ఆధార్ లింక్ చేసుకోకపోవడంతో ప్రస్తుతం ఐరిష్ వలన వైరస్ మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో తెలంగాణ రేషన్ డీలర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు బెల్లంపల్లి పట్టణంలో మంగళవారం డీలర్లు రేషన్ నిలిపివేయడం జరిగింది. పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని కార్డుదారులు కూడా ఐరిష్ తో రేషన్ తీసుకోవడానికి భయాందోళనకు గురవుతున్నారు. కావున రెవిన్యూ అధికారులు తక్షణమే స్పందించి ఇతర ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాలని రేషన్ డీలర్లు మరియు కార్డు దారులు కోరుతున్నారు.
No comments:
Post a Comment