సబ్బం హరి మృతికి సంతాపాన్ని ప్రకటించిన గవర్నర్ బండారు
విశాఖపట్నం, పెన్ పవర్
అనకాపల్లి మాజీ పార్లమెంట్ సభ్యుడు సబ్బం హరి కరోనా బారిన పడి చికిత్స పొందుతూ మరణించారనే వార్త తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. సబ్బం హరి మరణం చాలా బాధాకరం అని, విశాఖపట్నం అభివృద్ధికి అతను ఎంతగానో కృషి సల్పారని, నాకు సబ్బం హరి అత్యంత ఆత్మీయ పరిచయస్తులని అన్నారు. నేను కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పలు సమస్యలను నా దృష్టికి తీసుకువచ్చి పరిష్కరింపచేసేవారని, రాజకీయ పరిజ్ఞానం మెండుగా గల సబ్బం హరి అనేక విషయాలను లోతుగా అధ్యయనం చేసేవారని గుర్తుచేసుకున్నారు.అలాంటి వ్యక్తి ప్రస్తుతం మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని, ఆయన మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ దివంగత సబ్బం హరి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులకు కావలసిన శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
No comments:
Post a Comment