మంత్రి వనిత కు కృతజ్ఞతలు తెలిపిన వైసిపి పెద్దేవం
వైయస్సార్సీపీ పెద్దేవం బూత్ కన్వీనర్ వేము రామారావు కరోనా తో బాధపడుతున్నప్పుడు విషయం తెలుసుకున్న వైయస్సార్సీపీ జిల్లా కార్యదర్శి తోట రామకృష్ణ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత కు ఈ విషయం తెలియజేశారు. వెంటనే మంత్రి వనిత స్పందించి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ లో బెడ్ ఇప్పించి సకాలంలో వైద్యం అందేలా చూసారు. వేము రామారావు మాట్లాడుతూ మంత్రి వనిత ఆదేశాలమేరకు హాస్పిటల్ సూపరింటెండెంట్ తో అనుక్షణం ఫోన్ మాట్లాడుతూ, నాకు ఇంజెక్షన్లు కోర్స్ పూర్తి అయ్యేలాగా డాక్టర్ల తో మంత్రి వారి అడిషనల్ పియస్ మహాలక్ష్మి కుమార్ మాట్లాడారు. అలాగే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోన పట్ల చేస్తున్న కృషి గవర్నమెంట్ హాస్పిటల్ లో చాలా బాగుంది అని అన్నారు. ఎవరు అపోహలు నమ్మవద్దు అని,హాస్పిటల్ లో ఇంజక్షన్ ల కొరత లేదు అని, అన్ని సదుపాయాలు చాలా బాగున్నాయి అని, అందుకు గాను నేను సోమవారం నాడు కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నాను అని అన్నారు. నా వైద్యానికి సహాయం అందించిన మంత్రి తానేటి వనిత కి, మంత్రి వారి అడిషనల్ పియస్ మహాలక్ష్మి కుమార్ కి, వైయస్సార్సీపీ జిల్లా కార్యదర్శి తోట రామకృష్ణ కి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అని తెలియజేశారు. అలాగే గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,14 రోజులు నా దగ్గర కి రావద్దు అని, నా ఆరోగ్యం బాగుంది అని తెలియచేశారు.
No comments:
Post a Comment