Followers

పేదలకు ఆపన్న హస్తం అందించేందుకు బి ఎల్ ఆర్ ట్రస్ట్ సిద్ధం

 పేదలకు ఆపన్న హస్తం అందించేందుకు బి ఎల్ ఆర్ ట్రస్ట్ సిద్ధం... లక్ష్మారెడ్డి

పెన్ పవర్, కాప్రా 

కరోనా విజృంభిస్తున్న  సమయంలో పేద ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు బి ఎల్ ఆర్ ట్రస్ట్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ట్రస్ట్ చైర్మన్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి లక్ష్మా రెడ్డి స్పష్టం చేశారు.  కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఇందిరమ్మ గృహ కల్ప కాలనీ లో శనివారం బి ఎల్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా వ్యాప్తి నిరోధక సోడియం హైపోక్లోరైడ్ రసాయన ద్రావణం పిచికారి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఏడాది కాలంగా కోవిడ్ ప్రభావిత పేదలు నివాసముంటున్న కాలనీలు బస్తీల్లో నిత్యవసరాలను అందించి వారి కష్టాలు తీర్చుతూ పీ పీఈ కిట్లు , మాస్కులు, శానిటైజర్ లు,  గ్లౌజులు అందజేసినట్లు లక్ష్మారెడ్డి గుర్తుచేశారు. కోవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పేదలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  ఆస్పత్రులలో బెడ్లు దొరకక పేదలైన కరోనా వ్యాధి గ్రస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ చావు అంచులలోకి వెళ్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  కరోనా రక్కసి నుంచి మనకు మనము మన కుటుంబాలను రక్షించ కునేందుకు గాను మాస్క్ లు ధరిస్తూ పరిశుభ్రతతోపాటు వ్యక్తిగత దూరం పాటించాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో బి ఎల్ ఆర్ ట్రస్ట్ ప్రతినిధి నేమూరి మహేష్ గౌడ్, చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ ప్రతినిధి ఎంపల్లి పద్మారెడ్డి, ఇందిరమ్మ గృహకల్ప కాలనీ అధ్యక్ష కార్యదర్శులు రాచకొండ రోశయ్యగౌడ్, బత్తిని భాస్కర్ గౌడ్, ఎస్ సాగర్ గౌడ్, కే లక్ష్మణ్, సిహెచ్ పద్మ, సుబ్బయ్య, రంజిత్, వెంకటేష్, వినయ్, యూసుఫ్, సాయి కిరణ్, కాలనీవాసులు కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...