రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యం
రైతుల కోసం గుజ్జు పరిశ్రమల యజమానులు అంగీకరించారు
రోజుకు 500 మెట్రిక్ టన్నుల టమోటోలు కొనుగోలు కు సిద్ధం
టమోటాల సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లోకి
చిత్తూరు, పెన్ పవర్
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నేడు మరోసారి గుజ్జు పరిశ్రమ యజమానులతో ఉద్యానవన శాఖ మార్కెటింగ్ శాఖల అధికారులు నేడు జరిపిన చర్చల్లో రోజుకు ఐదు వందలు మెట్రిక్ టన్నుల టమోటాలను కొనుగోలు చేసేందుకు అంగీకరించారని ఉద్యానవన శాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాసులు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో శుక్రవారంనాడు పరిశ్రమ యజమానులతో కలెక్టరేట్ లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో లో రైతుల వద్ద నుంచి నేరుగా ఫ్యాక్టరీలు టమోటాలను కొనుగోలు చేస్తాయని అదేవిధంగా కొనుగోలు చేసిన టమోటా లకు సంబంధించిన సొమ్మును రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరుగుతుందని ఇందుకు సంబంధించి ఏపీ మహిళా సంఘాల సమాఖ్య వారు కొనుగోలుకు మధ్యవర్తిత్వం వహిస్తారు అని ఆయన అన్నారు. అదేవిధంగా మార్కెటింగ్ శాఖ సంయుక్త సంచాలకులు సుధాకర్ మాట్లాడుతూ మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోలు చేసి ఫ్యాక్టరీలకు టమోటాలను పంపడం జరుగుతుందని అలా పంపిన టమోటాలను గుజ్జు చేసి మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. మార్కెటింగ్ శాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు వివిధ మార్కెట్లలో కొనుగోలు చేస్తామని ప్రభుత్వం నిర్ణయించినట్లు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రధాన ఉద్దేశమని ఆయన అన్నారు. గుజ్జు పరిశ్రమల యాజమాన్యాల తరపున గోవర్ధన్ బాబీ మాట్లాడుతూ ప్రస్తుతం మామిడిపండ్ల సీజన్ మొదలు అయినా ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు అందరూ సహకరించడం ఆనందమని ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, జిల్లా కలెక్టర్ గుజ్జు పరిశ్రమల యజమానులతో టేలికాన్ఫెరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ సంయుక్త సంచాలకులు సుధాకర్, ఏ డి ఇందుమతి,ఉద్యాన వనశాఖ డి డి శ్రీనివాసులు, ఏ పి మాస్ వినాయక రెడ్డి, గుజ్జు పరిశ్రమ యజమానులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment