ఆక్వా చెరువులకు అందరు లైసెన్సులు కలిగి ఉండాలి
పెన్ పవర్,కొవ్వూరు
దేవరపల్లి మండలం తాసిల్దారు వారి కార్యాలయంలో మత్స్య శాఖ సహాయ సంచాలకులు బి.సైదా నాయక్ ఆధ్వర్యంలోజిల్లా స్థాయి కమిటీ వారి ఆదేశాల ప్రకారం మండల స్థాయి అధికారులకు ఆక్వా చట్టం 20 20 ఆంధ్రప్రదేశ్ చట్టం మరియు ఆంధ్రప్రదేశ్ చేపల మేతల చట్టం లపై మండల స్థాయి కమిటీ సభ్యులకు కొవ్వూరు మత్స్య శాఖ సహాయ సంచాలకులు సైదా నాయక్ అవగాహన కల్పించారు. కొత్తగా వచ్చిన ఆక్వా చట్టం ప్రకారం శాశ్వత ఆక్వా రైతులు లైసెన్సులు పొందాలి అని సూచించారు. కొత్త చట్టం ప్రకారం పాత లైసెన్స్ కలిగిన వారు మే 30 వ తారీఖు లోగా రెన్యువల్ చేయించుకోవలెను. లైసెన్స్ పొందని చెరువులు మరియు కొత్తగా చేరువులు త్రవ్వుకొనుటకు సంబంధిత పత్రాలు అనగా ఆధార్ కార్డు, పట్టాదారు పాసు బుక్కు ,80% వాటర్ లైట్ ఏరియా సెర్టిఫికెట్, గూగుల్ క్యాడ్ మ్యాప్, ఎకరానికి 1000రూపాయల చొప్పున ఫీజుతో గ్రామ సచివాలయం, మత్స్య శాఖ సహాయకులు (వి.ఎఫ్.ఏ) లను సంప్రదించవలెను. జూన్ 30 లోగా ఆక్వా లైసెన్స్ పొందిన వారి చెరువులను ధ్వంసం చేయబడును అని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్, మండల వ్యవసాయ అధికారి, ఎంపీడీవో, అటవీశాఖ అధికారి, మత్స్య శాఖ సహాయ తనిఖీ అధికారి వి. దేవానందం మత్స్యశాఖ సహాయకులు ఏ.శాంతి, టి. చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment