భౌతిక దూరం పాటిస్తూ మేడే దినోత్సవ వేడుకలు
పెన్ పవర్, కరప:
మండలంలోని పలు గ్రామాల్లో కనివారం కోవిడ్ నిబంధనల మేరకు మేడే దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరప, కొరుపల్లి, వాకాడ, పెనుగుదురు, నడకుదురు, గొర్రిపూడి తదితర గ్రామాల్లో సీఐటీయు ఆధ్వర్యంలో భవననిర్మాణ కార్మికులు, అంగన్వాడీలు, ఆశావర్కర్లు, మిడ్డే మీల్ వర్కర్లు, వీఏఓలు, కార్మిక, ఐక్య ఉద్యోగ సంఘాలు సంయుక్తంగా భౌతిక దూరం పాటిస్తూ ఈవేడుకలు నిర్వహించారు. సీఐటీయు జెండా ఆవిష్కరించి, కార్మికహక్కులు, కరోనాపై సమైక్యంగా పోరాటం చేద్దామని ప్రతిజ్ఞ చేశారు. ఈసందర్భంగా సీఐటీయు జిల్లా అధ్యక్షురాలు ఎం.వీరలక్ష్మి మాట్లాడుతూ కార్మికులు, శ్రమజీవులందరికీ ఉచితంగా కరోనా టీకా, మందులు ఇవ్వాలన్నారు. కార్మికవర్గాన్ని, ప్రజలను విభజించే ప్రయత్నాలను ఐక్యంగా పోరాడి ఓడించాలన్నారు. సీఐటీయు ప్రతినిధులు బుడ్డాల రాంప్రసాద్, సత్యవతి. భవాని తదితరులు పాల్గొన్నారు. ఐఏఎస్టియు ఆధ్వర్యంలో కరప, వేళంగి గ్రామాల్లో ఐఎఫ్ఎయు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ వర్కర్స్ మేడే దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఐఎల్బీయు జిల్లా సహాకార్యదర్శి గుబ్బల ఆదినారాయణ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలన్నారు. పంచాయతీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు రాగుల రాఘవ, జి.నూకరాజు, ఐఎల్టీయు జిల్లా కమిటీ నాయకుడు గణేసులు శ్రీనివాస్, దళితసంఘం నాయకులు వి.శ్రీనివాస్, టి.దేవి, జి. ఏను. బంగారు రాజు ఎస్. సత్యవతి వై.శ్రీను పాల్గొన్నారు..
No comments:
Post a Comment