మానవత్వం చాటుకున్న తొర్రూరు పోలీసులు.
తొర్రూరు, పెన్ పవర్తేదీ 21.04.2021న మహబూబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని శ్రీకృష్ణ హాస్పిటల్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన గుర్తుతెలియని వృద్ధురాలు చికిత్స పొందుతూ... మంగళవారం మృతి చెందింది.గుర్తుతెలియని వృద్ధురాలికి చెందిన వారు ఎవరూ రాకపోవడంతో మానవతా దృక్పథంతో తొర్రూరు పోలీసులు,మున్సిపల్ సిబ్బంది సహాయ సహకారాలతో అనాధ వృద్ధురాలికి అంత్య క్రియలు నిర్వహించినట్లు తొర్రూరు ఎస్ఐ సిహెచ్ నగేష్ తెలిపారు. ఎవరూ లేని అనాధ వృద్ధురాలికి రెండవ ఎస్ఐ మునిరుల్లా, కానిస్టేబుల్ సర్వార్ పాషా, హోంగార్డ్ రఫీయా లతో కలిసి పూలమాలవేసి, అంత్యక్రియలు నిర్వహించారు.
No comments:
Post a Comment