పలు కంపెనీలలో మేడే జెండాను ఆవిష్కరించిన కెయం.ప్రతాప్ గౌడ్..
జీడిమెట్ల ,పెన్ పవర్
ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పలు కంపెనీలలో మేడేను పురస్కరించుకొని శ్రమశక్తి అవార్డు గ్రహీత కే.యం. ప్రతాప్ గౌడ్ జెండాను ఆవిష్కరించారు.. జీడిమెట్ల పారిశ్రామికవాడలోని కొపల్లి ఫార్మాలో మరియు రంగారెడ్డి నగర్ పారిశ్రామికవాడలోని ఆల్మెలో కెమికల్స్ కంపెనీ లో మరియు తదితర కంపెనీలలో యూనియన్ అధ్యక్షుని హోదాలో కార్మికులతో కలిసి జెండాను ఆవిష్కరించిన శ్రమ శక్తి అవార్డ్ గ్రహీత టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కే.యం.ప్రతాప్ గౌడ్.. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ వెట్టి చాకిరి నుంచి కార్మికులు విముక్తులైన సందర్భంగా ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందన్నారు. కార్మికులతో కలిసి కంపెనీ యాజమాన్యం వారు కార్మిక చట్టాలను అమలుపరుస్తూ, అవగాహనతో పనిచేస్తేనే కంపెనీ మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాంత రావు, శ్రీనివాస్ రెడ్డి, మల్లికార్జున్, జయన్న, రామస్వామి, వెంకటేష్, జానీ కుమార్, రామ కృష్ణ, కృష్ణ యాదవ్, గణేష్, రామచందర్, సురేష్, వి.ఆర్.సి రెడ్డి, మనోహర్, నరేష్, సుబ్బారావు, కృష్ణంరాజు, గోపాలకృష్ణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment