కరోనా రోగుల పట్ల అమానుషం
రాజమహేంద్రవరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో, ప్రైవేటు ఆసుపత్రులలో కరోనా మృతుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్న వారిపై తక్షణం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సిపిఐ నగర కార్యదర్శి నల్లా రామారావు డిమాండ్ చేశారు.ఈ మేరకు సోమవారం సాయంత్రం ఆయన ఒక ప్రకటనలో కరోనా రోగుల పట్ల ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని,కనీసం ప్రజలకు పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ చేయించ లేకపోవడం విచారకరమని, కరోనా రెండవ దశలో కరోనా సోకిన వారికి సరైన వైద్య సదుపాయాలు అందడం లేదని, కరోనా మెడిసిన్ కిట్లు కూడా ఎక్కడా ఎవరికీ ఇవ్వడం లేదన్నారు. ప్రజల ప్రాణాలను గాలికి వదిలేశారని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాల వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థల ఉనికి కూడా ప్రస్తుతం కనబడటం లేదన్నారు.ఆశా వర్కర్లు, ప్రభుత్వ వ్యవస్థను, యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించి ప్రజలకు సేవలు సకాలంలో అందేలా చూడాలని, వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదని, అందుకే రోగులను అరబయటే వదిలేస్తున్నారని, అదేవిధంగా మృత దేహాలను సైతం ఎటువంటి ప్రోటోకాల్ అనుసరించకూడా ఎక్కడ పడితే అక్కడ ఉంచేయడం సమంజసం కాదన్నారు. డాక్టర్లు కొరత ఉన్నందున తక్షణం యుద్ధ ప్రాతిపదికన డాక్టర్లను, సిబ్బందిని నియమించాలని, అదేవిధంగా ప్రైవేటు ఆసుపత్రులలో కరోనా వైద్యానికి చార్జీలను నిర్ణయించి వాటిని అమలయ్యే విధంగా చూడాలని డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment