అద్దె పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవం
మెంటాడ మండలం లోని 30 గ్రామ పంచాయతీలు ఉండగా, ఈ ఏడాది చింతాడ వలస గ్రామం నూతన పంచాయతీగా ఏర్పాటయింది. సొంత పంచాయతీ భవనం లేకపోవడంతో వై ఎస్ ఆర్ సి పి సీనియర్ నాయకులు, సర్పంచ్ ప్రతినిధి గేదెల సతీష్ గ్రామంలో ఒక ఇంటిని అధిక తీసుకొని పంచాయితీ కార్యాలయంగా ఏర్పాటు చేశారు. గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది వారి వారి పనులు చేయడానికి గ్రామ పంచాయతీ కార్యాలయం లేకపోవడంతో తాత్కాలికంగా అద్దె భవనం ప్రారంభోత్సవం చేసినట్లు ఆయన తెలిపారు. ఇకమీదట గ్రామస్తులు పంచాయతీ కార్యాలయానికి వచ్చి సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు ద్వారా తన సమస్యలను చెప్పుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment