ప్రతి వార్డు పరిధిలో పక్కాగా ఫీవర్ క్లినికల్
చిత్తూరు, పెన్ పవర్
చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి వార్డు లో పూర్తిస్థాయిలో ఫీవర్ క్లినిక్ నిర్వహించాలని నగర కమిషనర్ పి.విశ్వనాథ్ వార్డు కార్యదర్శులను ఆదేశించారు. నగరంలో కోవిడ్-19 నియంత్రణ చర్యలు, ఫీవర్ క్లినిక్ల నిర్వహణ అంశాలపై శనివారం ఉదయం నగర కమిషనర్ వార్డు అడ్మిన్, ఆరోగ్య, శానిటేషన్ కార్యదర్శులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వార్డు పరిధిలో ఫీవర్ క్లినిక్లను పక్కాగా నిర్వహించాలని, ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేయాలన్నారు. జ్వరంతో బాధపడుతున్న వారిని, ఇతర లక్షణాలు ఉన్న వారిని గుర్తించి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలని, మాస్కులు ధరించడం,భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ ఉపయోగించాలని అవగాహన కల్పించాలన్నారు. నగరంలో మాస్కులు ధరించకుండా తిరుగుతున్న వారిని గుర్తించి అపరాధ రుసుం వసూలు చేయాలని వార్డు కార్యదర్శులను ఆదేశించారు. కోవిడ్ ప్రోటోకాల్ ను తప్పనిసరిగా పాటించాలన్నారు.
No comments:
Post a Comment