జనసేన పార్టీ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ
విజయనగరం, పెన్ పవర్
స్థానిక 42వ డివిజన్ పరిధిలో ఉన్న అయ్యన్నపేట జంక్షన్ మరియు జంక్షన్ వద్దనున్న ఎస్సి కొలనీలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు,జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణరావు(బాలు) ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఇంటిఇంటికీ మాస్కులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జనసేన పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర దళిత ఐక్యవేదిక అధ్యక్షులు ఆదాడ మోహనరావు మాట్లాడుతూ రెండో వేవ్ కరోనా తీవ్రతదృష్ట్యా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని బాలు చేపట్టారని, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేటప్పుడు డబుల్ మాస్కులు ధరించాలని, ఇటువంటి తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా పనిలేకుండా బయట తిరగరాదని, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరుచుకోవాలని,ఇటువంటి సమయంలో ప్రభుత్వం ప్రకటించిన సమయాల్లోనే బయటకు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళిరావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు లోపింటి కళ్యాణ్, చిన్న,కృష్ణ, పాల్గొన్నారు.
No comments:
Post a Comment