పేదింటి బిడ్డ పెండ్లికి ఆర్ధిక, సహాయం అందించిన, టిఆర్ఎస్ నేత
పెన్ పవర్, మందమర్రిమందమర్రి పట్టణానికి చెందిన టి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బండి సదానందం పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సహాయం అందించి తన పెద్ద మనసును చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే మందమర్రి పట్టణంలోని 23వ వార్డు మేదర్ బస్తీ కి చెందిన రామగిరి మల్లేష్ శంకరమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మంగలి పని చేసుకుని జీవనం సాగిస్తున్న రామగిరి మల్లేశ్ పెద్ద కూతురు రామగిరి శ్వేత వివాహము మే 16వ తేదీన నిశ్చయం కాగా పెళ్లి చేసే ఆర్థిక స్తోమత లేకపోవడంతో వీరి కుటుంబ సభ్యులు మంగళవారం అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండి సదానందం యాదవ్ ను కలిసి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగా స్పందించి వెంటనే ఆర్ధిక సహాయంగా 20 వేల రూపాయల చెక్కు తోపాటు ఒక క్వింటాలు బియ్యాన్ని అందించారు. ఈ కార్యక్రమం లో రాజ్ కుమార్ రంగనాథ్, సతీష్ , రిధం సది , బంటి తిరుపతి, ప్రసాద్, రఘు గంగుల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.ఆర్ధిక సహాయం ను అందించిన బండి సదానందం కు రామగిరి మల్లేశ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
No comments:
Post a Comment