నాచారం డివిజన్ లో వ్యాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
అధికారులు తీరు ఫై మండిపాటు స్పందించక పోతే ధర్నా
కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్
తార్నాక , పెన్ పవర్కరోనా కేసులు పెరిగుతుండటంతో నాచారం డివిజన్ లో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. చాల రోజులుగా నాచారం డివిజన్ లో కోవిద్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలనీ అధికారులను కోరామని తెలిపారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి లు ఆదేశాలు జారీ చేసిన డిఎంఎచ్ఓ కాలయాపన చేయడంపై కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ మండిపడ్డారు. నాచారం ప్రజలు కోవిద్ పరీక్షలకు వెళ్ళాలి అంటే మల్లాపూర్ ఆరోగ్య కేంద్రానికి వెళ్ళలిసిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాచారం లో కోవిద్ పరీక్షా కేంద్రం తో పాటు, వాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. నాచారం లో రైతు బజార్ బస్తి దవాఖాన తో పాటు కోవిద్ వ్యాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనీ అధికారులను కోరారు. అధికారులు స్పందించకపోతే ఆందోళన చేస్తామని , డిఎంఎచ్ఓ కార్యాలయం ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు.
No comments:
Post a Comment