తాడిపూడిలో కోవిడ్ దృష్ట్యా పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం
తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామంలో సర్పంచ్ నామా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కోవిడ్ దృష్ట్యా గత నెల రోజుల నుండి గ్రామంలో అనేక పనులు చేపట్టారు. గ్రామములో బ్లీచింగ్ చల్లించడం, ఇంటింటికి హైపో క్లోరైడ్ స్ప్రే చేయించడం జరిగింది. మంగళవారం నాడు గ్రామమంతా మరోసారి హైపో క్లోరైడ్ స్ప్రే చేయించారు. మరియు మంచినీటి ట్యాoకులను శుభ్రం చేయించడం, డ్రైనేజీల్లో పూడికతీత వంటి పనులు ముమ్మరం చేశారు. ఎప్పటికప్పుడు కోవిడ్ పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పంచాయతీ సెక్రెటరీలు దగ్గు చంద్రశేఖర్, బదిరెడ్డి భీమేశ్వరరావు, విఆర్వో ఎం.ప్రకాష్ ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
No comments:
Post a Comment