విలేఖరికి అండగా నిలిచిన వాట్సాప్ గ్రూప్ సభ్యులు...
పెన్ పవర్, మల్కాజిగిరిమల్కాజిగిరి నియోజకవర్గం లో గౌతమ్ నగర్ డివిజన్ సాక్షి దినపత్రిక విలేకరి మొహమ్మద్ అబ్దుల్ రెహమాన్ గతనెల ప్రమాదవశాత్తు వాహనం పై నుంచి పడి తీవ్రంగా గాయపడి ఇంట్లో చికిత్స పొందుతున్నాడు,వెంటనే అబ్దుల్ రెహమాన్ సతీమణి ఆరోగ్యం క్షీణించి లోతుకుంట ఆస్పత్రిలో లో చేర్చి వైద్యం చేయిస్తున్నాడు, కరోనా వల్ల అబ్దుల్ రెహమాన్ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని మానవ సేవే మాధవ సేవ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు తమ గ్రూప్ లో ఈ విషయాన్ని సభ్యులతో చర్చించడం జరిగింది. గ్రూప్ సభ్యులు 28 మంది కలిసి రూ16,800 నగదును సహాయంగా అందించారు. అబ్దుల్ రెహమాన్ వారి కుటుంబ సభ్యులు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నందున మంగళవారం గ్రూప్ సభ్యులు నమస్తే తెలంగాణ విలేకరి వెంకటేష్ ద్వారా రెహమాన్ కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అబ్దుల్ రెహమాన్ వాట్సాప్ గ్రూప్ ద్వారా మానవ సేవే మాధవ సేవ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపాడు,ఈ కార్యక్రమంలో గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు, రషీద్, లయన్ హనుమంతరావు ముదిరాజ్, సక్కురీ భాస్కరరావు, హోటల్ శేఖర్, మనీ, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment