Followers

ఘనంగాప్రపంచ కార్మిక దినోత్సవం....

 ఘనంగాప్రపంచ కార్మిక దినోత్సవం.... 

పెన్ పవర్, ఉలవపాడు 

మే 1. మేడే సందర్భంగా ఉలవపాడు మండలం లో కరేడు ర్యాంపు లోని పి టి పి కంపెనీ వద్ద పి టి పి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సిఐటియు జెండాను ఆ సంఘం అధ్యక్షులు సవరం శ్రీనివాసులు ఆవిష్కరణ చేశారు, మండల కేంద్రంలోని సింగరాయకొండ ఆటో స్టాండ్ లో ఉలవపాడు మండల ఆటో వర్కర్స్ యూనియన్  (సీఐటీయూ) ఆధ్వర్యంలో సీఐటీయూ జండా ను ఆ సంఘం మండల కార్యదర్శి జె. సురేష్ బాబు ఆవిష్కరించారు. సిపిఎం పార్టీ జండాను ఆ పార్టీ నాయకులు ఎస్.డి గౌస్ ఆవిష్కరించారు  అనంతరం ర్యాలీగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వద్ద కు వెళ్లి విగ్రహానికి సంఘం అధ్యక్షులు sd. జహీర్  పూలమాలవేసి జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న సిఐటియు జిల్లా కార్యదర్శి జీవీబీ కుమార్ మాట్లాడుతూ 1886లో చికాగో నగరంలో పనిగంటలు తగ్గించాలని, వేతనాలు పెంచాలని కార్మికవర్గం పోరాడుతుంటే, ఇది సహించలేని పెట్టుబడిదారీ వర్గం కార్మికుల పైన అమానుషంగా కాల్పులు జరిపిందని ఆ కాల్పుల్లో 32 మంది అమరుల అయ్యారని, వారి రక్తంలో తడిసిన గోడను ఎర్ర జెండా ఎగరేసి కార్మిక శక్తిని చాటారని, అప్పటి నుండి ఎనిమిది గంటల పనిదినం అమలవుతుందని తెలిపారు. అయితే నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూపనిని 8 గంటలనుండి 12 గంటలకు పెంచిందని, కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు కాల రాస్తుందని విమర్శించారు. ఈ ప్రభుత్వ విధానాల తెచ్చుకోవటమే నేడు కార్మికవర్గం ముందున్న కర్తవ్యం అని పిలుపునిచ్చారు. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సిపిఎం నాయకులు  పొట్లూరు రవి కొమరగిరి వెంకటేశ్వర్లు, సిఐటియు నాయకులు గంజి శ్రీనివాసులు చిమటా శ్రీనివాసులు, మండవ కోదండరామ్, జేమ్స్, పీ మస్తాన్ రావు  తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...