రంజాన్ తోఫా అందజేసిన మంత్రి
వనపర్తి, పెన్ పవర్వనపర్తి పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో రంజాన్ తోఫా (కిట్టు) మంత్రి నిరంజన్ రెడ్డి ముస్లింలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. పవిత్ర రంజాన్ మాసం భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని రంజాన్ పండుగను అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మంత్రి కోరారు. పేద ప్రజలముఖంలో చిరునవ్వులు ఇవ్వడానికి కెసిఆర్ రంజాన్ తోఫా రంజాన్ పండుగను అత్యంత ప్రతిష్టాత్మక జరుపుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మంత్రి చెప్పారు. తెలంగాణ ప్రజలందరూ కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని రంజాన్ పండుగను అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మంత్రి కోరారు. దాదాపు అక్కడికి వచ్చిన 120 మంది లబ్ధిదారులకు మంత్రి తన చేతుల మీదుగా అందజేశారు. ఈ వివరాలు టిఆర్ఎస్ నేత షేక్ జహంగీర్ విలేకరులకు తెలిపారు.
No comments:
Post a Comment