అర్హులకు పింఛన్ల ప్రొసీడింగ్ పత్రాలను అందజేసిన ఎన్ని రామచంద్రరావు
ఆమదాలవలస రూరల్, పెన్ పవర్
పేదలను ఆదుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని సర్పంచ్ ఎన్ని రామచంద్రరావు అన్నారు. మండలంలోని కట్యాచార్యుల పేట గ్రామ సచివాలయంలో అర్హులకు పింఛన్ల ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరూ సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా కరోనా విషయంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment