బీసీ బిడ్డ ఈటల రాజేందర్ పై కుట్రలు చేస్తే సహించేది లేదు:. జాజుల లింగంగౌడ్
తార్నాక , పెన్ పవర్బడుగు బలహీన వర్గాల గొంతుక,ప్రతి పక్షంలో ఉన్న,స్వపక్షంలో ఉన్న ఎల్లప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేసే గొప్ప నాయకునిపై ఒక ప్లాను ప్రకారమే కుట్రలో భాగంగానే ఇరికించారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ అన్నారు.హైదరాబాద్ లోని ఈటెల రాజేందర్ ని ఆయన నివాసంలో కలిసి బీసీ సంఘాల తరుపున ఆయనకు పూర్తి మద్దతుగా నిలబడుతున్నట్లు లింగంగౌడ్ తెలిపారు.బీసీల అస్తిత్వం, తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల మన్ననలు పొంది సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో చదివి,ఐదుసార్లు శాసనసభ్యునిగా తిరుగులేని ప్రజా నేతను ముఖాముఖిగా ఎదుర్కొనే దమ్ము లేక కుట్రలు చేస్తున్నారని అన్నారు. నాడు దళిత ఉపముఖ్యమంత్రి రాజయ్యను,నేడు(బీసీ) బడుగు బలహీన వర్గాల బిడ్డ ఈటెల ను తప్పుడు ఆరోపణలతో, తప్పుడు కథనాలు పదే పదే ప్రసారం చేస్తూ,వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చిన కేసీఆర్ అధికారిక ఛానల్ టీ న్యూస్,నమస్తే తెలంగాణ పత్రిక చెరువు భూమిని కబ్జా చేసిన MLA ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి , పేదల భూముల్ని గుంజు కుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరిస్తున్న మంత్రి మల్లారెడ్డి, మంత్రి పువ్వాడ ఇంకా ఎంతో మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న వీళ్ళందరి అక్రమాలు మన దొర కేసీఆర్ కు కనపడటం లేదా?ఎంతో మంది ఎమ్మెల్యేల భూకబ్జా ఆరోపణలు వస్తున్న కనీసం మీ అధికారిక ఛానల్ టీ న్యూస్ లో ఒక్కరోజైనా న్యూస్ ప్రసారం చేశార ఆరోపణలపై మంత్రి వివరణ తీసుకోకుండా పనిగట్టుకొని ఈటల రాజేందర్ మీద కుట్ర పన్నారని అన్నారు.టిఆర్ఎస్ పార్టీ పెట్టిన నాటి నుండి ఫౌండర్ గా మొదటి నుంచి వెన్నంటి ఉండి, తెలంగాణ ఉద్యమంలో మొదటి వరుసలో నిలుచున్న తెలంగాణ రాష్ట్ర సాధన లో ముఖ్య భూమిక పోషించిన ఈటల రాజేందర్ ను ఇబ్బంది పెట్టి పొమ్మన లేక పొగ పెట్టడమేనని అన్నారు.ఏ రకమైన విచారణ లేకుండా దళిత,బలహీన వర్గాల పట్ల వెంటనే నిర్ణయాలు తీసుకుంటున్న కేసీఆర్ మీకు చిత్తశుద్ధి ఉంటే మీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ,మంత్రుల ఆస్తులపై విచారణ చేపట్టి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని లేనిచో దళిత, బలహీన వర్గాల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు.
No comments:
Post a Comment