కరోనా తో వార్డు కౌన్సిలర్ మృతి
పెన్ పవర్, కొవ్వూరు
కొవ్వూరు మున్సిపల్ కార్పొరేషన్ 23 వ వార్డు కౌన్సిలర్ మురికొండ రమేష్ కరోనాతో మృతిచెందారు. రమేష్ మృతికి మన గౌరవ మంత్రివర్యులు తానేటి వనిత తన ప్రగాఢ సంతాపం తెలియచేసారు. కొవ్వూరు మున్సిపాలిటీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ తనదైన శైలిలో సేవ చేస్తూ ఎంతో పేరు తెచ్చుకున్నారు. మున్సిపల్ కార్పోరేషన్ వార్డు కౌన్సిలర్ మృతికి చైర్మన్ భావనా రత్నకుమారి తో పాటు కౌన్సిలర్లు కూడా తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.
No comments:
Post a Comment