త్రాగునీటికి కటకట లాడుతున్న గిరిజన గ్రామాలు
మంచినీటి పథకాలు పుష్కలం ఫలితం మాత్రం శూన్యం
ఏజెన్సీలో తూతూ మంత్రంగా తాగునీటి నిర్మాణాలు
జేబులు నింపుకుంటున్న అధికార్లు కాంట్రాక్టర్లు
ఆర్డబ్ల్యూఎస్ అధికారుల పనితీరుపై గిరిజన సంఘం ఆగ్రహం
పెన్ పవర్ , విశాఖపట్నం
విశాఖ ఏజెన్సీలో తాగు నీరు సదుపాయం లేక ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీరు కోసం ఊటలు గెడ్డలను ఆశ్రయిస్తున్నారు. గిరిజనుల తాగు నీటి పధకాల పేరుతో కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికి వీసమెత్తు ఫలితం ఇవ్వడం లేదు.తూతూ మంత్రంగా నిర్మణాలు చేసి కాంట్రాక్టర్లు జేబులు నింపుకుంటున్నారని గిరిజన సంఘం గిరిజన సమైక్య ఆరోపిస్తున్నారు. దీనికి పెదబయలు మచ్చుతునకగా చెప్పవచ్చు. పెదబయలు మండలం 23 పంచాయతీల పరిధిలో నూటికి 80% గ్రామాలలో సురక్షిత మంచినీరు అందుబాటులో లేదని 48% శాతం పైగా గ్రామాలు గ్రావిటీ ద్వారా ఆధారపడి బతుకుతున్నాయని 30% శాతం గ్రామాల్లో నేటికీ ఊట గడ్డ మీద ఆధారపడి ఉన్నదని కేవలం 28% గ్రామాల్లో మాత్రమే బోర్ పంపులు సోలార్ ద్వారా మంచినీళ్లు తాగుతున్నారని 2014 -2018 మధ్యకాలంలో ప్రతి గ్రామానికి బోర్ పంపుల ద్వారా ఇంటింటికి సురక్షిత మంచినీరు అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినప్పటికీ ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నిర్లక్ష్యం, పనిలో నాణ్యత లేకపోవడం వల్ల కోట్ల రూపాయలు డబ్బులు వృధా అవడంతో పాటు, సొమ్ము చేసుకున్నారు దీనిపై ఉన్నతాధికారులు సరి అయిన దర్యాప్తు చేసి గిరిజనులకు నీళ్లు అందించే విషయంలో పూర్తి వైఫల్యం చెందారని విమర్శించారు. గత మూడేళ్ల క్రితం గోమంగి పంచాయితీ సరియపల్లి గ్రామంలో 12 లక్షల రూపాయలు వెచ్చించి బోరు తీసి ఒక మంచినీటి ట్యాంక్ నిర్మించారు కానీ ట్యాంకులో ఒక్క బొట్టు మంచినీరు పడలేదు 12 లక్షలు అప్పనంగా కాంట్రాక్టు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మింగేశారు.
ఈ విషయంపై ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారి అయిన జగదీష్ గారిని వివరణ కోరితే సంబంధంలేని కారణాలు చెప్పి తప్పించుకున్నారు మిగిలిన గ్రామాలలో కూడా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ఉన్నత అధికారులు జోక్యం చేసుకోకపోవడం వల్ల ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఆగడాలకు అంతులేకుండా పోయిందనీ అన్నారు. మంచి నీటి సమస్యపై పంచాయతీ కార్యదర్శులకు సర్పంచులకు రిపోర్టు చేస్తే తము పంచాయతీ తీర్మానాలు పెట్టిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులను నుండి సరైన స్పందన ఉండదని ఎస్టిమేషన్ వేసే విషయంలో అలాగే చేసిన పనికి నిధులు మంజూరు చేసే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతుంది. గోమంగి గ్రామంలో 100 నుండి 150 గిరిజన కుటుంబాలకు గ్రావిటీ నీళ్లే గతి గ్రావిటీ ద్వారా వస్తున్న చుక్క చుక్క నీళ్ల కోసం గంటల తరబడి వేచి చూడాలి అది కూడా ఏ సమయంలో వస్తుందో తెలియని పరిస్థితి నీళ్లు రాకపోతే ప్రతిసారి స్థానిక గ్రామస్తులే వెళ్లి చిన్నచిన్న మరమత్తులు చేసుకుని జీవిస్తున్నారు గ్రావిటీ నుండి నీళ్లు రాకపోతే ప్రత్యామ్నాయంగా మంచినీటి బావి గాని ఊట గడ్డ లు గాని బోర్వెల్ గాని అందుబాటులో లేకపోవడం వల్ల గత్యంతరం లేక గడ్డ నుండి కలుషితమైన బురద నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని దీని ఫలితంగా ప్రస్తుతానికి ప్రతి ఒక్క ఇంట్లో సీజనల్ వాంతులు విరోచనాలు చలి జ్వరం తలనొప్పి అనేక వైరస్ లకు గురవుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా నిధులు దుర్వినియోగం చేయకుండా ఆయా గ్రామ పంచాయతీల ప్రజలకు ఉపయోగపడే విధంగా నిధులు ఖర్చు పెట్టి త్రాగు నీటిని అందించాలని గోమంగి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇంటింటికి వెళ్లి వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, సురక్షిత మంచినీరు గ్రామంలో ఉన్న ప్రజలందరికీ పుష్కలంగా అందే విధంగా చర్యలు తీసుకోవాలని మంచినీళ్లు అందిస్తున్నామనే ఉద్దేశంతో నిధులను దుర్వినియోగంపరుస్తూ జేబులు నింపుకుంటున్నా సంబంధిత అధికారులపై చర్యలు తక్షణమే తీసుకోవాలని. మంచినీళ్ల సమస్య వెంటనే పరిష్కారం చేయకుండా అలసత్వం చేస్తున్న సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులను విధుల నుండి వెంటనే తొలగించాలని లేనిపక్షంలో అధికారులు ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ పెద్ద ఎత్తున పోరాటం చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృథ్వీరాజు గిరిజన సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి కూడా రాధాకృష్ణ గోమంగి శేఖర్ రుంజాల జయ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment