మేమూ మనుషులమే...
విరామం లేకుండా విధులేలా....
రిమ్స్ స్టాఫ్ నర్సుల ఆందోళన...
విరామం లేకుండా తమతో రిమ్స్ నర్సింగ్ సూపరెండింట్ విధులు నిర్వహించేలా తమ పై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తూ ఆదివారం సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో నిరసన కార్యక్రమాన్ని స్టాప్ నర్సులు ఐక్యంగా నిర్వహించారు.తామంతా కోవిడ్ విధులు నిర్వహిస్తున్నామని, ఇప్పటికే తమలో కొంతమంది కోవిడ్ బారిన పడి ఇబ్బందులు పడుతున్నారని స్టాప్ నర్సులు వాపోయారు. తమకు శెలవులు ఇవ్వకుండా నర్సింగ్ సూపరెండెంట్ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నట్లు విమర్శించారు.ఈ నేపధ్యంలో తామంతా నిరసన కార్యక్రమం చేపట్టాల్సి వచ్చిందని వారంతా పేర్కొన్నారు.స్టాప్ నర్సుల నిరసన కార్యక్రమం దగ్గరకు విచ్చేసిన జేసి సుమిత్ కుమార్‌కు తమ సమస్యలను స్టాప్ నర్సులు విన్నవించారు. సీనియర్ ఉద్యోగులకు అయితే శెలవులు ఇస్తున్నారని, కొత్తగా చేరిన తమకు నిబందనలు ప్రకారం ఇవ్వాల్సిన శెలువులు కూడా ఇవ్వడం లేదని జేసి కి వివరించారు. శెలవులు లేకుండా తామెలా పనిచేయగలమని, ఒత్తిడితో తీవ్రంగా బాదపడుతున్నట్లు చెప్పారు. స్పందించిన జేసి స్టాప్ నర్సులతో మాట్లాడుతూ శెలవులు లేకుండా పనిచేయడం ఏంటని, డ్యూటీ దిగాక 5 రోజులు పాటు శెలవులు ఉండేలా చేయాలని, ఆ విధంగా విధులు నిర్వహించాలని,ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగాలు చేయాలని కోరారు. సెకెండ్ వేవ్ దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని జేసి సుమిత్ సూచించారు.రు. జేసి హామితో స్టాప్ నర్సులు శాంతించి నిరసన కార్యక్రమాన్ని విడిచి జేసికి కృతజ్ఞతలు తెలిపారు.
No comments:
Post a Comment