ముమ్మరంగా జరుగుతున్న పారిశుద్ధ్య పనులు
మెంటాడ మండలంలో అతిపెద్ద గ్రామమైన జక్కువ గ్రామములో సర్పంచ్ లచ్చి రెడ్డి సత్యవతి ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి శిరీష ఆధ్వర్యంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ప్రస్తుతము చిన్న పాటి వర్షాలు కురవడంతో ముందు జాగ్రత్త చర్యగా పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేసినట్లు సర్పంచ్ సత్యవతి తెలిపారు. ఇటువంటి రోగాలు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment