Followers

నిర్మానుష్యంగా రహదారులు

 నిర్మానుష్యంగా  రహదారులు

 భయం గుప్పిట్లో ప్రజలు
 ఒకపక్క కరోనా, మరోపక్క తీవ్ర ఎండలు

మెంటాడ, పెన్ పవర్ : 

గత కొద్ది రోజులుగా మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మండలంలోని పలు రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఒకపక్క కరోనా, మరోపక్క ఎండ తీవ్రత కు మండల ప్రజలు భయం గుప్పిట్లో తమ కుటుంబ సభ్యులతో కలసి ఇళ్లలోనే గడుపుతున్నారు.

అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రాకూడదని ఒకపక్క జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అవగాహన కల్పించడంలో ప్రజల్లో కూడా కొంతమేర అవగాహన వచ్చింది. ఇటీవల వివిధ కారణాలతో మండలంలోని పలు గ్రామాల్లో పలువురు మృతిచెందిన సంఘటనలు కూడా ఉన్నాయి. దీనితో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమకు తామే   తమ ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నంలో నిమగ్నం అయ్యారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...