ఘనంగా పి.వి.జి.97వ జయంతి!!
ప్రపంచ రాజకీయ చరిత్రలో పట్టాభిషేకం జరిగిన మహారాజు సోషలిస్టు గా మారింది ఒక్క పి.వి.జి.రాజు ఒక్కరేనని డాక్టర్ పి.వి.జి.గొప్ప మానవతావాదాని డాక్టర్ పి.వి.జి.రాజు కళావేధిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు,శనివారం పివిజి 97 వ జయంతి కార్యక్రమాన్ని వేదిక కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ముందుగా పివిజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం భీశెట్టి మాట్లాడుతూ విజయనగరం మహారాజుల వంశ చిట్టచివరి పట్టాభిషిక్తుడు పివిజి ఒక్కేరేనని మహారాజుల వైభవాలను అవలీలగా వదిలేసి సౌమ్యవాదిగా సామాన్య ప్రజల సంక్షేమం కోసం రాజకీయ ప్రస్థానం చేసారని,సింహాచలం దేవస్థానం తో పాటుగా రాష్ట్రంలో ని 104 దేవాలయాలకు ధర్మకర్త గా వ్యవహరించారని రాజకీయాల్లో పివిజి కి గొప్ప చరిత్ర ఉందని 4 దఫాలుగా పార్లమెంట్ సభ్యుడు గా 5 దఫాలు గా ఎమ్మెల్యే గా గెలిచి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గా విద్యా శాఖ మంత్రి గా రాష్ట్రంలో అనేక సంస్కరణలు తెచ్చారని ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రో ఛాన్సలర్ గా విశ్వవిద్యాలయం కీర్తి ప్రతిష్టలు దేశవ్యాప్తంగా విస్తరింప చేసారు.\
రాజకీయాల మలిదశలో భారత సనాతన ధర్మంని, అధ్యాత్మికతను, ఆచరణలో చూపించిన కర్మ యోగి,రాజర్షి,మహర్షి, మన పివిజి కావడం మనకి గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు గా క్రికెట్ అభివృద్ధికి కృషి చేశారని,సౌత్ ఇండియా గోల్ఫ్ చాంపియన్ గా పివిజి నిలిచారని 1958 లో మాన్సస్ సంస్థ స్థాపించి పేద ప్రజలకు విద్యను అందిస్తూనే కోటను వేల ఎకరాల భూమిని దానం చేసిన గొప్ప మానవతా వాది స్వర్గీయ పివిజి రాజు మాత్రమే అని అన్నారు,ప్రతిసారి పివిజి జయంతి సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులకి పివిజి పేరుతో పురస్కారాలు అందచేసేవారమని కరోనా కారణంగా గత ఏడాది, ఈ ఏడాది అందించలేకపోయామని ఆవేదన వ్యక్తంచేశారు, సాధారణంగా సామాన్య స్థాయి నుండి అసామాన్య స్థాయికి వ్యక్తులు ఎదిగారని మనం చరిత్రలో చదువుతుంటాము కానీ డాక్టర్ పివిజి రాజు అసామాన్య స్థాయి నుండి సామాన్య స్థాయికి దిగివచ్చి తాను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడే పారిశుద్ధ్య కార్యక్రమాలు(ఒడిఎఫ్)ను నిర్వహించి దేశంలో ఎమ్మెల్యేలకి ఆదర్శంగా నిలిచారని భీశెట్టి అన్నారు ఈ కార్యక్రమంలో వేదిక ప్రతినిధులు డాక్టర్ బాల భార్గవి,ఆశా, ఎర్నిబాబు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment