ఫీజు వసూలుకు 5న వేలం పాట
చిత్తూరు, పెన్ పవర్
చిత్తూరు నగరపాలక సంస్థకు చెందిన కూరగాయల మార్కెట్, స్లాటర్ హౌస్(జంతు వధశాల), కాసు బ్రహ్మానంద రెడ్డి బస్టాండ్, చేపల చెరువులు సంబంధించి 2021- 22 వ సంవత్సరానికి గాను ఫీజు వసూలు చేసుకొనుటకు ఈ నెల 5వ తేదీన వేలంపాట నిర్వహించనున్నట్లు నగర కమిషనర్ పి.విశ్వనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు వేలం పాట జరుగుతుందని తెలిపారు. నగరపాలక సంస్థకు చెందిన వివిధ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లలో ఖాళీగా ఉన్న షాపుల రుసుమును నిర్ణయించిన నెలసరి అద్దె పై వాపసు చేయని గుడ్విల్ పద్ధతి పైన ఈ నెల 5వ తేదీన నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు వేలంపాట నిర్వహించనున్నట్లు కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. వేలం పాటకు సంబంధించిన పూర్తి వివరాలకు కార్యాలయ పని వేళల్లో రెవెన్యూ విభాగం నందు సంప్రదించవచ్చని తెలిపారు.
No comments:
Post a Comment