మంత్రి వనిత కు 2 వ విడత కోవిడ్ వ్యాక్సిన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత శనివారం తాడేపల్లిగూడెంలో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ లో భర్త డాక్టర్ తానేటి శ్రీనివాస్ తో 2 వ విడత కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది. మంత్రి వనిత మాట్లాడుతూ కరోన సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అర్హత కలిగిన ప్రతీ ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు. ప్రతీ ఒక్కరు కరోన నియంత్రణ నిబంధనలు పాటిస్తూ, అవసరమైతే తప్ప మిగిలిన సమయాల్లో బయటకు రాకూడదని తెలిపారు. బయటకు వచ్చినప్పుడు మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించి, మనల్ని, మనకుటుంబాన్ని, మనసమాజాన్ని కరోన నుండి కాపాడుకోవాలని తెలియజేశారు.
No comments:
Post a Comment