ఘనంగా శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి14వ వార్షికోత్సవం..
పెన్ పవర్, కాప్రాకాప్రా డివిజన్ లోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో 14వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు వార్షికోత్సవం సందర్భంగా హోమము ధ్వజారోహణం నిర్వహించారు. అభిరాం శర్మ రుత్వికులు. అర్చకులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తామని ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూజా కార్యక్రమం చేసామని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ కరోన మహమ్మారి దేశం నుండి తరిమి కొట్టే విధంగా అందరూ జాగ్రత్తలు పాటించాలని లక్ష్మీ చెన్నకేశవ స్వామి దయా భక్తులపై ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో రవి మూర్తి శర్మ ,కే కిరణ్ చార్యులు.పీ హరినాథ్ శర్మ , ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఎర్ర అశోక్ కుమార్ గౌడ్ చైర్మన్ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి జె కృష్ణమాచార్యులు, ధర్మకర్త లు చిన్నమ్మ రాజు వెంకటరమణ, మండల , నవీన్ కుమార్ గౌడ్ శ్రీమతి బచ్చు అరుణ జ్యోతి, కొప్పుల కుమార్ , గోగికర్ నవీన్ కుమార్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment