వి.ఆర్.పురం మండలంలో ఘనంగా 135 వ "మేడే" వేడుకలు
వి.ఆర్.పురం, పెన్ పవర్
వి.ఆర్.పురం మండలంలో రేఖపల్లి, వి.ఆర్.పురం, వడ్డిగూడెం గ్రామాల్లో సిపిఐ మండల కార్యదర్శి కర్నాటి యేసు (రాంబాబు)ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి కర్నాటి యేసు మాట్లాడుతూ 1886 ముందు ప్రపంచంలో ఎక్కడా పనిగంటలు నియమ నిబంధనలు అమలులో లేవని కార్మిక హక్కులు, చట్టాలు లేవని అటువంటి పరిస్థితిలో కార్మికులకు 8 గంటలు పని ఉండాలని వారానికి ఒకరోజు శెలవు కావాలని, భోజన విరామం కావాలని సంఘం పెట్టుకొనే హక్కు, కార్మిక చట్టాలను అమలు చేయాలని 1886 మే1 నుండి పెద్ద ఎత్తున ఉద్యమం చేయగా.. పోలీసులకు కార్మికులకు మధ్య జరిగిన గొడవల్లో ఎందరో కార్మికులు అసువులుబాశారని ఆ కార్మికుల రక్తంతో తడిచిన చేతి రుమాలు నేడు కోట్లాదిమంది కార్మికులకు అండగా ఎర్ర జెండాగా మారిందని అంతటి చరిత్ర కలిగిన మేడే ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు పండుగగా జరుపుకొంటున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శివగిరి కామేశ్వరరావు ముత్యాల దయాకర్ బాగుల దుర్గాప్రసాద్ అల్లుడు శేఖర్ బోర్ర సాయిబాబు శివగిరి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment