పోలమాంబ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 135 వ మే డే దినోత్సవం
మహారాణి పేట, పెన్ పవర్
శనివారం ఉదయం రెల్లి వీధి అంబేద్కర్ పోలమాంబ ఆటో ఓనర్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ సొసైటీ ఏఐటీయూసీ అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో 135 వ మేడే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా ఆటోరిక్షా కార్మిక సంఘం అధ్యక్షులు సీఎం రమణ ముఖ్య అతిథిగా పాల్గొని పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులను ఉద్దేశించి ప్రతి ఆటో డ్రైవర్ విధినిర్వహణలో ఖాకీ యూనిఫాం ధరించాలి అలాగే మన ఆటో యొక్క రికార్డులను డ్రైవింగ్ లైసెన్స్ సి బుక్ ఇన్సూరెన్స్ ఆటో ఉంచుకోవాలని ప్రతి ఆటో డ్రైవర్ మాస్కో స్థానిక టీజర్ వాడాలని తెలియజేశారు గత 30 ఏళ్ళ నుండి ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయడం జరుగుతుంది కానీ నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆటోడ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు కూడా చేయలేదు నేటి రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ అండ్ ఓనర్ కు పదివేల రూపాయలు ఆశ చూపి ఒకవైపు ఇస్తూ మరొకవైపు ఆటో కార్మికుల పై పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా పెంచుతూ ఆటో కార్మికుల పై భారం మోపుతున్నారు 2019వ సంవత్సరం కరోనా టైం లో ఆటో డ్రైవర్లపై పెట్టిన కేసులను రద్దు చేయాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలపై ఆటో కార్మికులు అందరూ యూనియన్ పరంగా చేయుచున్న కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా ఆటో రిక్షా కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు ఇంటి అప్పలరాజు స్టాండ్ అధ్యక్షులు తుపాకుల ఈశ్వరరావు, స్టాండ్ నాయకులు సత్తిబాబు కేరళ రమణ,ప్రసాదు,ఎల్లారావు,గణేష్,కొండ,గేజు బద్ద అప్పారావు,పోలరాజు,కరాటి మోహన్,శేషు ఎల్,కృష్ణ మరియు ఆటో డ్రైవర్లు అందరూ పాల్గొన్నారు.
No comments:
Post a Comment