135 వ మేడే సందర్భంగా చిత్తూరు నగరంలో ఎర్రజండా రెపరెపలు
కార్మికుల హక్కులను, చట్టాలను, కాలరాస్తున్న కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను తిప్పికొడదాం. ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు ఎస్ నాగరాజు పిలుపు 135 వ మేడే సందర్భంగా చిత్తూర్ నగరంలో ఆర్టీసీ 1 డిపో ,2 డిపో, ఏ పీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్, భవన నిర్మాణ కార్మిక సంఘం మార్కెట్ చౌక్, సివిల్ సప్లై హమాలి వర్కర్స్ యూనియన్, ఐ ఎం ఎఫ్ ఎల్ హమాలి వర్కర్స్ యూనియన్, ఫీడ్ హమాలి వర్కర్స్ యూనియన్, వామన , న్యూట్రిన్, సుందరయ్య, సువేరా, ఎంజీఆర్, ఆటో డ్రైవర్స్ యూనియన్, సిమెంట్ స్టీల్ హమాలి వర్కర్స్ యూనియన్, వివిధ రంగాలకు సంబంధించిన ఏఐటీయూసీ అనుబంధ సంఘాల ఎర్ర జెండాలతో పాటు పాత ప్రశాంత్ నగర్ కాలనీలో ఎర్ర జెండాలను ఏఐటీయూసీ నాయకులు ఎస్. నాగరాజు, గంటా మోహన్, కె. వెంకటేష్, సీ కే జయచంద్ర, కే .మణి, బి. ఆర్ముగం రెడ్డి,ఏ. సత్యమూర్తి,పి.యస్. నాగరాజు నాయుడు, దాసరి చంద్ర,గిడ్డుబాయ్, యస్ .జయలక్ష్మి,కె. విజయ్ గౌరీ, యస్ . పుష్పలత, కె.రమాదేవి, పి. గజేంద్ర బాబు,పి. రఘు, పెనుమూరు బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేడే చరిత్రను కార్మికులు సాధించుకున్న చట్టాలను హక్కుల గురించి కార్మికవర్గానికి తెలియజేశారు. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1గంట వరకు ఎర్ర జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో జాన కారపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ లక్ష్మణమూర్తి ,అనుబంధ సంఘాల నాయకులు రాధాకృష్ణ ,మనీ, గజేంద్ర రెడ్డి, దామోదర్ రెడ్డి, మునిరత్నం, విక్టోరియా, కృష్ణ, దాసు, కమల్ ,నాగరాజ్, ప్రేమ్ రాజ్, రమేష్ , సురేష్ శరవణ, పయని, మురుగేష్, బాబు నాయుడు, వెంకటేష్, గంగాధర నెల్లూరు మండల కేంద్రంలో మేడే జెండాను ఆవిష్కరించారు, కృష్ణమూర్తి , జయరామ్, రవి, పొన్ను రంగం తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment