12వ వార్డులో బొర్వెల్ కు మరమ్మత్తుల నిర్వహణ
బెల్లంపల్లి, పెన్ పవర్..పట్టణ మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు కాల్ టెక్స్ లో రామకృష్ణ థియేటర్ వెనుకాల గల మినీవాటర్ సప్లై బోర్ పాడయ్యి ఎండాకాలం వలన పంపులలో నీరు సరిగ్గా రాక బస్తి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,వార్డు కౌన్సిలర్ నెల్లిశ్రీలతరమేష్ దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి,వార్డు తెరాస నాయకులు రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ ఇంజనీర్లతో మాట్లాడి, వారి సహాయంతో దగ్గరుండి బోర్ వెల్ లో పైపుల మరమ్మత్తులు నిర్వహించారు. పైపులమరమ్మత్తు ద్వారా బస్తి మొత్తానికి నీటికొరత లేకుండా చేసారని,బస్తి ప్రజలు కౌన్సిలర్ కు కృతజ్ఞతలు తెలిపారు
No comments:
Post a Comment