Followers

రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యo వలనే ఇంటి స్థలాలు కోల్పోయారు

రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యo వలనే ఇంటి స్థలాలు కోల్పోయారు

 కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇసంపెల్లి సైదులు

నెల్లికుదురు /పెన్ పవర్

1998సంవత్సరం లో తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో  మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం లోని రామన్నగూడెం గ్రామం లో ఇండ్లు లేని నిరుపేదల కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన ఇళ్ల స్థలాల భూమిని పరిశీలించిన అనంతరం ఇస్సంపెల్లి  సైదులు మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించినప్పటికీ పట్టాలు ఇచ్చి పంపిణీ చేయకుండా రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వలన తిరిగి ఇప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకోవడానికి సిద్ధ పడిందని అన్నారు.గత హాయంలో  ప్రైవేటు వ్యక్తుల దగ్గర అభూమి కొనుగోలు చేస్తున్న సందర్భంలో భూ యజమానికి సరియైన గిట్టుబాటు ధర రావడం లేదని అతను ఇవ్వని అని చెప్పడం వలన అదే గ్రామానికి చెందిన ఇల్లు లేని నిరుపేదలు స్వతహగా  98 వ సంవత్సరంలో సుమారు 80 వేల రూపాయలు యజమానికి చెల్లించడం జరిగిందనిఈ విదంగా  కోనుగోలు చేసిన  భూమిని రెవిన్యూ అధికారులు పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం చేయడం వలన ఆ స్థలం నిరుపయోగంగా ఉన్నందున సహకార సంఘం సొసైటీ కి ఎకరం భూమి ఇస్తున్నామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వలన లబ్ధిదారులు నష్టపోతున్నారని ఆయన విమర్శించారు అధికారులు ఆభూమిని లబ్ధిదారులకు ఇవ్వనందున రోజులు గడుస్తున్న కొద్దీ ఆ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని అధికారులకు అనేకమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆచరణలో అమలుకు నోచుకోలేదని  ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు ఆ భూమినలో సర్వే నిర్వహించి లబ్ధిదారులకు  పంపిణీ చేసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలనిలెనియెడల లబ్ధిదారులకు చెందేవరకువారితో కలిసి అందోళన చెస్తామని ఇసంపేల్లి సైదులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కడారి ఐలయ్య,బండి శ్రీను, మల్యాల నర్సయ్య, ఉపేందర్  వెంకన్న,గుగులోతు వాల్యా, గుండ బిక్షం,కనకం శ్రీలత పడాల కుమార్  తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...