యోగ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఇంటి వద్దకే ఉచిత భోజనం
కూకట్ పల్లి, పెన్ పవర్కరోన రెండో దశ విజ్రంభిస్తున్న వేళ ప్రముఖ యోగా గురువు జగన్ గురూజీ ఆధ్వర్యంలో కోవిడ్ వైరస్ సోకిన కుటుంబాలకు ఉచితంగా భోజనం అందించేందుకు కూకట్ పల్లి లోని యోగ విజ్ఞాన కేంద్రం ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు జగన్ గురూజీ మాట్లాడుతూ కరోన వైరస్ బారినపడి ఆహారం సమకూర్చుకోలేని కుటుంబాలకు తమ సంస్థ ఆధ్వర్యంలో ఇంటి వద్దకే ఉచితంగా ఆహారం అందిస్తామని ప్రకటించారు. కూకట్ పల్లి ప్రాంతానికి పది కిలోమీటర్ల పరిధిలో కరోనతో పోరాడే కుటుంబాలు ఒక్కరోజు ముందుగా ఎంత మందికి ఆహారం కావాలో 9441887766 అనే నంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇస్తే ఇంటి ముందే అన్నపూర్ణేశ్వరి కిట్ ను అందజేస్తామని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోన భూతాన్ని దేశం నుండి పారద్రోలాలని పిలుపునిచ్చారు.
No comments:
Post a Comment