Followers

దాతల సహకారంతో నిరంతరం సేవా కార్యక్రమాలు.

 దాతల సహకారంతో నిరంతరం సేవా కార్యక్రమాలు.

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు షేక్ అజీముద్దీన్. 

పెన్ పవర్, మందమర్రి

దాతల సహకారంతో నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు షేక్ అజీముద్దీన్ అన్నారు.  ప్రజా సేవ  వెల్ఫేర్ సొసైటీ ప్రారంభించి రెండు సంవత్సరాలు  పూర్తయిన సందర్భంగా గురువారం భాగ్యనగర్ కాలనీకీ చెందిన మాధరబోయిన కొమురయ్య  కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యం నెలకు సరిపడా కిరాణా సామాను కూరగాయలను అందించారు. అనంతరం షేక్ అజీమొద్దీన్ మాట్లాడుతూ మా సంస్థ ప్రారంభించిననాటి నుండీ నేటి వరకు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు. మా సంస్థ ఆధ్వర్యంలో  పేదలకు,విద్యార్థులకు, సహాయసహకారాలు అందించడం జరిగిందని భవిష్యత్తులో దాతలు సహకారంతో నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తా మని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు  సుద్దాల ప్రభుదేవ్, పున్నం గణేష్  మామిడి అజయ్. జావిద్ ,పప్పు వినోద్, ప్రవీణ్, సుందర్ , చింటూ పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...