కోవిడ్ కారణంగా విద్యార్థుల సన్మాన కార్యక్రమం వాయిదా
ఇంద్రవెల్లి, పెన్ పవర్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటివలే పలు యూనివర్సిటీలలో సీట్లు సాధించిన విద్యార్థులకు గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ (ఐపీఏస్ ) చేతుల మీదుగా ఏప్రిల్ 25న ఇంద్రవెల్లిలో నిర్వహించే సన్మాన కార్యక్రమంతో పాటు అంబేద్కర్ జయంతి విజయోత్సవ ర్యాలిని కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో వాయిదా వేస్తున్నామని ఇంద్రవెల్లి అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షుడు సర్కాళే శివాజీ తెలిపారు. ఇంద్రవెల్లి వాసూలు అందరూ తమకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం వచ్చే నెల బుద్ధ జయంతి రోజున అప్పటి పరిస్థితిని బట్టి నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
No comments:
Post a Comment