Followers

సంక్షేమ సంఘం ఎన్నికలలో కె.యం.ప్రతాప్ బలపర్చిన వ్యక్తి గెలుపు..

 సంక్షేమ సంఘం ఎన్నికలలో కె.యం.ప్రతాప్ బలపర్చిన వ్యక్తి గెలుపు.. 


కుత్బుల్లాపూర్, పెన్ పవర్ 

సంక్షేమ సంఘం ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కే.యం.ప్రతాప్ బలపరిచిన అల్లా బక్ష్ 136 ఓట్ల మెజార్టీతో అధ్యక్షునిగా గెలుపొందారు.. చింతల్ 128 డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో జరిగిన కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్షులుగా గొడుగు గుర్తుపై పోటీ చేసిన అల్లా బక్ష్ విజయం సాదించారని కే.యం.ప్రతాప్ గౌడ్ పేర్కొన్నారు.. ప్రధాన కార్యదర్శి గా గొడుగు గుర్తుపై పోటీ చేసిన శ్యామలమ్మ 48 ఓట్ల మెజారిటీతో గెలిచిందని తెలిపారు.. శ్యామలమ్మకు 699 ఓట్లు రాగా, ప్రత్యర్ధులు, మాస్క్ గుర్తుపై పోటీ చేసిన రాఘవేంద్ర స్వామికి 651 ఓట్లు పోల్ అవగా, చైర్ గుర్తుపై పోటీ చేసిన వరదరాజు కు 413 ఓట్లు పోలయ్యాయని పేర్కొన్నారు... ఈ సందర్భంగా వారు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కే.యం.ప్రతాప్ ను నూతన కమిటి కలిసి ధన్యవాదాలు తెలియజేశారు..అనంతరం ప్రతాప్ గౌడ్ ను సంక్షేమ సంఘం నాయకులు శాలువాతో సత్కరించారు..ప్రతాప్ నూతనంగా ఎన్నికైన భగత్ సింగ్ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు అల్లా బక్ష్ కు మరియు ప్రధాన కార్యదర్శి శ్యామలమ్మకు శుభాకాంక్షలు తెలియజేశారు.. ప్రతాప్  మాట్లాడుతూ నూతన కమిటీకి తాను  ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు. అందరూ కలిసిమెలిసి ఉంటూ బస్తి అభివృద్ధికి పాటుపడాలన్నారు..

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...