Followers

ఘనంగా హరిరామ జోగయ్య జన్మదిన వేడుకలు

ఘనంగా హరిరామ జోగయ్య జన్మదిన వేడుకలు 

రాజమహేంద్రవరం, పెన్ పవర్

మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ హోమ్ మంత్రి , కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి  హరిరామజోగయ్య 85వ జన్మదిన వేడుకలు సోమవారం రాజమండ్రి లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక గౌతమి జీవకారుణ్య సంఘంలోని సుమారు 100 మంది వృద్దులకు పండ్లు పంపిణి చేసారు.ఈ సందర్భంగా వృద్దులు హరిరామజోగయ్య  నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని దీవించారు. ఈ కార్యక్రమంలో కాపుసంక్షేమ సేన రాజమండ్రి పార్లమెంటరీ అధ్యక్షులు చోడిశెట్టి చంద్రశేఖర్ , కార్యదర్శి పల్లెల వెంకట్ , రాజమండ్రి సిటీ నియోజకవర్గ అధ్యక్షులు చింతం వీరబాబు , అరిగెల దొరబాబు,న్యాయవాది మాదారపు మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...