విద్యుద్ ఘాతంతో పాడి గేదె మృతి
60 వేల వరకు నష్టపోయిన రైతు.
ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం అందించాలని రైతు వేడుకోలు.
తొర్రూరు, పెన్ పవర్విద్యుద్ ఘాతంతో పాడి గేదె మృతి చెందిన ఘటన మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని బొజియ తండా గ్రామ శివారు ఈదుల కుంట తండాలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బొజియా తండా శివారు ఈదుల కుంట తండాకు చెందిన బానోతు నెహ్రూ పాడి గేదెను పచ్చిక మేపేందుకు వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లాడు. మేత మేసే క్రమంలో విద్యుత్ తీగలకు గేదె తగలడంతో షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. రోజు 5 లీటర్ల పాలు ఇచ్చే పాడిగేదె విలువ సుమారు 60 వేలు ఉంటుందని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని, బాధిత రైతు నెహ్రూ వేడుకున్నాడు. గేదె మృతి చెందిన సమాచారం అందుకున్న స్థానిక సర్పంచ్ మాలోత్ కాలు నాయక్ సందర్శించి, బాధితులను ఓదార్చారు.
No comments:
Post a Comment