కార్పెంటర్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక
ఎటపాక,పెన్ పవర్సూర్యచంద్ర కార్పెంటర్ యూనియన్ అధ్వర్యంలో నూతన కార్యవర్గం ఎన్నికున్నారు. గురువారం ఎటపాక మండలంలోని నెల్లిపాకా లో కార్పెంటర్ యూనియన్ అధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నికున్నారు. కార్పెంటర్ యూనియన్ అధ్యక్షులు గా గుంతపల్లి రామ కృష్ణ, కార్యదర్శి గా చిట్యాల శ్రీనివాస రావు, కోశాధికారి చీరాల వీరయ్య, ఉపాధ్యక్షుడిగా బోస్ కాంతారావు, గౌరవ సలహా దారుడు గా గొల్లపల్లి అప్పల స్వామి లను యూనియన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కార్పెంటర్ లకు పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, కార్పెంటర్లు యూనియన్ సమస్యలపై పోరాడేందుకు సిద్దంగా ఉంటామని, యూనియన్ అధ్వర్యంలో మనకు కావాల్సిన హక్కుల కోసం, ప్రభుత్వం ద్వారా వివిధ సంక్షేమ పథకాలు వచ్చేలా కృషి చేస్తానని అన్నారు.
No comments:
Post a Comment