జన్మదిన వేడుకలు కు ఘనంగా ఏర్పాట్లు...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు 29వ వార్డు కార్పొరేటర్ కోలగట్ల శ్రావణి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నామని మహిళా విభాగం నేతలు మరియు నగరపాలక కార్పొరేటర్లు శ్రీమతి బో నెల ధనలక్ష్మి, శ్రీమతి పిన్నింటి కళావతి, శ్రీమతి తాళ్లపూడి సంతోషి, శ్రీమతి బాల పద్మావతి లు తెలిపారు. సోమవారం నాడు కంటోన్మెంట్ పార్టీ జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని 26వ తేదీ సోమవారం నాడు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఆ రోజు ఉదయం పట్టణంలోని పలు ఆలయాలు లో ఆమె పేరు మీద పూజలతో పాటు, వృద్ధుల ఆశ్రమం, ప్రేమ సమాజం తో పాటు పలు దేవాలయాలలో శ్రావణి గారు పేరున అన్న వితరణ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. పట్టణంలోని 50 డివిజన్లలో మహిళా విభాగం, పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో కూడా పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. జన్మదినాన్ని పురస్కరించుకొని 26వ తేదీ ఉదయం పదిన్నర గంటలకు కంటోన్మెంట్ జోనల్ కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అన్ని డివిజన్ లనుంచి మహిళా విభాగం నేతలు, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అతి చిన్న వయసులోనే కోలగట్ల శ్రావణి గారు రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి గా, కార్పొరేటర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన దగ్గరనుంచి మహిళా విభాగాన్ని పటిష్ట పరుస్తూ, కార్పొరేటర్గా డివిజన్ ప్రజలకు సేవలు అందిస్తూ తండ్రికి తగ్గ తనయ గా తన వంతు బాధ్యతలు నిర్వహిస్తున్నారు అని అన్నారు. పార్టీ ఆదేశించిన కార్యక్రమాలు అమలు చేస్తూ, మహిళా విభాగం ఉత్తేజపరుస్తూ పార్టీ పటిష్టతకు తన వంతు కృషి చేస్తున్నారని అన్నారు. శాసనసభ ఎన్నికల్లో మరియు నగరపాలక ఎన్నికలలో పార్టీ విజయానికి ఆమె చేసిన కృషి ఎనలేనిది అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు అండగా ఉంటూ వారికి మనోధైర్యాన్ని కల్పించారన్నారు. తండ్రి మరియు శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి గారి బాటలో పయనిస్తూ ప్రజలతో మమేకమై, ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు. శ్రావణి గారు పార్టీ మరియు ప్రజలు తన ప్రాణంగా భావించి అందరికీ అందుబాటులో ఉండడం ప్రజల అదృష్టం అని చెప్పవచ్చు అని అన్నారు. విలేకర్ల సమావేశంలో మహిళా కార్పొరేటర్లు భోగాపుర పు లక్ష్మి, దాసరి సత్యవతి, మీసాల రమాదేవి, టీ సంధ్యారాణి, ఆ ల్తీ సత్య కుమారి, పొo తపల్లి మాలతి, దుప్పాడ సునీత తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment