అక్రమ నిర్మాణాలు కూల్చివేత..
పెన్ పవర్ దినపత్రికలో వచ్చిన వార్తకు ఆర్డీఓ ఆదేశాలతో మంగళవారం కూల్చివేతలు..
అక్రమంగా వెలసిన ఏడింటిలో మూడు రూములు.. రెండు బేస్మెంట్లు తొలగించన రెవెన్యూ అధికారులు..
మిగతావి సర్వేచేయించి కూల్చవేయనున్నట్లు ఆర్డీఓ మల్లయ్య వెల్లడి..
మిగిలిన రూములను కూడా తొలగించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు..
కుత్బుల్లాపూర్, పెన్ పవర్
కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని సూరారంలో పెన్ పవర్ దినపత్రికలో ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాలపై వరుస కథనాలు ప్రచురిస్తున్న సూరారం గ్రామ సర్వేనెంబర్ 181 ప్రభుత్వ స్థలంలో మరియు కోర్టు కేసులో ఉన్న 180 లో వెలసిన మొత్తం 7 అక్రమ నిర్మాణాలలో మూడు రూములను, రెండు బేస్మెంట్లను మల్కాజిగిరి ఆర్డీఓ మల్లయ్య ఆదేశాలతో కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు మంగళవారం కూల్చివేశారు.. సర్వేయర్ అందుబాటులో లేనందున మిగతా రూములను సర్వే చేసిన అనంతరం మిగతావి కూల్చివేయనున్నట్లు అధికారులు తెలిపారు.. అయితె మరో నాలుగు రూములు పట్టాదారు భూమిలో వస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని, స్థానిక తహసీల్దారు మైపాల్ రెడ్డి అందుబాటులో లేనికారణంగా పూర్తి సర్వే నిర్వహించి నాలుగు రూములపై చర్యలు తీసుకుంటామని మల్కాజిగిరి ఆర్డీఓ మల్లయ్య పేర్కొన్నారు.. ఈకూల్చివేతలలో విఆర్ఓ బాలరాజు విఆర్ఏలు,మరియు రెవెన్యూ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.. విచిత్రం ఏమిటంటే 1954 నుండి నేటివరకు సంభందిత ప్రభుత్వ భూమి సర్వేనెంబర్ 181 రెవెన్యూ రికార్డులలోనే ప్రభుత్వ భూమిగా ఉంది.. అది రెవెన్యూ అధికారులు జారీచేసిన రికార్డులలో ఉంది..మరొక స్థలం సర్వేనెంబర్ 180 నవాబుల కాలంనుండి ఖాతానెంబర్ 74 "మీర్జా నిజాం బేగ్" అనే మహిళ పేరు మీదనే ఉంది.. సదరు కబ్జాదారులు తమ పేరుమీద మార్చాలని 2015లో చేసుకున్న ధరఖాస్తును..కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు 29-11-2017 వ తేదీనా మెమో నెంబర్ "బి/1135/2017" తిరస్కరించారు.. 2017 రెవెన్యూ రికార్డు (పహానీ)ప్రకారం "మీర్జా నిజాం బేగ్" పేరుమీదనే వస్తుంది.. కేవలం మీర్జా నిజాం బేగ్ కు మాత్రమె చెందిన 20 గుంటల పట్టాభూమి వారి వారసులకు మాత్రమే చెందుతుంది.. లేనియెడల ప్రభుత్వం స్వాధీనపర్చుకోవాలని సూరారం వాసులు కోరుతున్నారు..
No comments:
Post a Comment