Followers

ధూళిపాళ్ల నరేంద్ర అక్రమ అరెస్టు ప్రభుత్వం పన్నిన కుట్రలో భాగమే

 ధూళిపాళ్ల నరేంద్ర అక్రమ అరెస్టు ప్రభుత్వం పన్నిన కుట్రలో భాగమే           

   

పెన్ పవర్, కందుకూరు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు , పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ను అప్రజాస్వామిక పద్దతిలో పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ యస్.సి సెల్ జిల్లా కార్యదర్శి గోచిపాతల  మోషే  ఖండించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ నాయకులు , కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్తూ మానసికంగా ఇబ్బందులకు గురి చేసి శునకానందం పొందుతున్నారని ప్రభుత్వం తీరుపై మోషే విమర్శలు చేశారు. అమూల్ పాల డైయిరీపై ప్రజలకు నమ్మకం లేక సంగం డైయిరీకి పాలు పోస్తుంటే చూస్తూ ఓర్వలేని ప్రభుత్వం సంగం డైయిరీ అధినేత తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల. నరేంద్ర ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసినంత మాత్రాన అమూల్ డైయిరీ కు ప్రజలు పాలు పోస్తారనుకోవడం ప్రభుత్వం భ్రమగానే మిగిలిపోతుందన్నారు. రైతుల భాగస్వామ్యంతో నడుపుతున్న సంగం డైయిరీని నిర్వీర్యం చేసి గుజరాత్ రాష్ట్రానికి చెందిన అమ్మూల్ సంస్థకు అప్పనంగా మన రాష్ట్రానికి చెందిన పాలు అమ్మడం హేయమైన చర్యగా అభివర్ణించారు. రైతులకు పెద్దపీట వేస్తున్నామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం రైతుల భాగస్వామ్యంతో నడిపే సంగం డైయిరీని నిర్వీర్యం చేసే కుట్రను చూస్తేనే రైతులపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్ధమవుతుందని మోషే ఎద్దేవా చేశారు .

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...