Followers

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన గుమస్తాల సంఘం.

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన గుమస్తాల సంఘం.

అభినందించిన మార్కెట్ చైర్మన్, ఎంపీపీ,  జడ్పీటీసీ.

కేసముద్రం, పెన్ పవర్

మహుబూబాబాద్ జిల్లా  కేసముద్రం మండలం  గుమాస్తాల సంఘం ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి రూ.1.25 లక్షలు అందజేయడం అభినందనీయమని కేసముద్రం మండల పరిషత్ అధ్యక్షులు వోలం చంద్రమోహన్, కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి నారాయణరావు అన్నారు. కేసముద్రం విలేజ్ కి చెందిన గుమస్తా కమటం స్వామి ఇటీవల మృతి చెందగా కడు పేదరికంలో ఉన్న ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితులను తెలుసుకున్న కేసముద్రం గుమాస్తాల సంఘం, ఆగు మసాలా సంఘం సభ్యులు అందరూ  తమ జీవితంలో కొంత డబ్బును సమకూర్చగా ఆలా సమకూర్చిన  లక్షా 25 వేల రూపాయ లు కాగా రూ.1 లక్షను మృతుని కుమార్తె కముటం సాత్విక పేరున స్థానిక యూనియన్ బ్యాంకులో  ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి, మిగతా రూ.25 వేల నగదును బుధవారం మృతుని కుటుంబీకులకు ఎంపీపీ ,మార్కెట్ చైర్మన్, జెడ్పీటీసీ చేతుల మీదుగా  అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుమస్తా మృతి చెంది ఆయన కుటుంబం కడు దీన స్థితిలో ఉండగా గుమాస్తా సంఘం ఆధ్వర్యంలో వారికి ఆర్థిక సహాయం అందించి అండగా నిలవడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా గుమాస్తా ల  సంఘం గౌరవ అధ్యక్షులు ముత్యాల శివకుమార్ మాట్లాడుతూ మృతుడు స్వామి కుటుంబ ఆర్థిక పరిస్థితులను తెలుసుకుని ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచిన ఎంపీపీ చంద్రమోహన్, మార్కెట్ చైర్మన్ నారాయణ రావు, జెడ్ పి టి సి శ్రీనాథ్ రెడ్డి తో పాటు వ్యాపారస్తులు, గుమస్తా సోదరులందరికీ పేరుపేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  మిత్రుడు స్వామిని కోల్పోవడం తమను తీవ్రంగా కలచివేస్తున్న ట్లు శివ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు కమటం శీను,గుమస్తాల సంఘం అధ్యక్షుడు చిట్ల సంపత్, ప్రధాన కార్యదర్శి బండారు రాజు తో పాటు మేకల యాదగిరి, కొండ బోయిన శ్రీను, లెక్కల దేవేందర్ , కుమార్, క ముటం శ్యామ్, బొల్లు చంద్రయ్య, కొనక టి వెంకట్ రెడ్డి, మంచన ప్రసాద్, సిరికొండ శ్రీకాంత్, ఎనుముల మహేందర్, బండి ప్రభాకర్ దడువాయి అధ్యక్ష కార్యదర్శులు ఎర్రం శెట్టి అశోక్ కంది వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...