విశాఖ కలెక్టర్ కు మెయిల్ ద్వారా వినతి పత్రాన్ని పంపించిన.. శంకు వెంకటేశ్వరరావు
మహారాణి పేట, పెన్ పవర్
విశాఖలో కరోనా మహమ్మారి విజృంభణకు అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నా అధికార యంత్రాగానికి చీమకుట్టినట్లైనా లేదని విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సంకువెంకటేశ్వరరావు విమర్శించారు.ఈ మేరకు విశాఖ కలెక్టర్ కు మెయిల్ ద్వారా ఒక వినతి పత్రం పంపించారు.ముఖ్యంగా చాలా కోవిడ్ వాక్సినేషన్ సెంటర్ల వద్ద ప్రజలు కనీసం దూరం కూడా పాటించడంలేదన్నారు.ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిన ప్రభుత్వం ఆదాయం పైనే ద్రుష్టి పెట్టిందన్నారు.మద్యం దుకాణాలు,మాంసం దుకాణాలు,రైతుబజార్లు కరోనా వ్యాప్తికి కేంద్రాలుగా మారాయన్నారు.ఆటోలు,సిటీ బస్సుల్లో ఏమాత్రం కరోనా నిభందనలు పాటించడంలేదన్నారు. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నారని,కరోనా పై ప్రభుత్వం సరైన అవగాహన కల్పించాలన్నారు.కరోనా బాధితులను ప్రవేట్ ఆసుపత్రులు దోచుకుంటున్నాయని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు లేవన్నారు.కరోనా తో ఇప్పటికే అనేకమంది సామాన్యులతో పాటుగా ప్రజా ప్రతినిధులు,అధికారులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేసారు.వెంటనే అధికారులు జోక్యం చేసుకొని మద్యం దుకాణాలు మూసివెయ్యాలని విజ్ఞప్తి చేసారు.కోవిడ్ వాక్సినేషన్ సెంటర్లు,రైతు బజార్లు తదితర రద్దీ ప్రదేశాల్లో ప్రజలు గుంపులు గుంపులుగా తిరుగకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.
No comments:
Post a Comment